హటాత్తుగా తమిళనాడులో తలెత్తిన రాజకీమ సంక్షోభంతో షా ప్రధాన్యత చెన్నైకి మారినట్లు సమాచారం.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడిందా? భాజపా వర్గాలు అవుననే అంటున్నాయి. మామూలుగా అయితే ఈనెల 27 నుండి మూడు రోజల పాటు షా రాష్ట్ర పర్యటనకు రావాలి. మూడు రోజులు కూడా షా విజయవాడలోనే క్యాంపు వేస్తారని ఢిల్లీ నుండి రాష్ట్ర నేతలకు సమాచారం అందింది. దాని ప్రకారమే నేతలు అన్నీ ఏర్పాట్లూ చేసేసారు. అయితే, హటాత్తుగా తమిళనాడులో తలెత్తిన రాజకీమ సంక్షోభంతో షా ప్రధాన్యత చెన్నైకి మారినట్లు సమాచారం. అక్కడ ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేకున్నారు. దాంతో దేశమంతా ఇపుడు తమిళనాడు రాజకీయలపైనే దృష్టి పెట్టింది. కాబట్టి అమిత్ షా కూడా తమిళనాడు డెవలప్మెంట్లతో బిజీగా ఉండటంతో రాష్ట్ర పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
