చంద్రబాబుకు బెయిల్ : నిజం గెలిచిందని కాదు.. కళ్లు కనిపించడం లేదనే.. అంబటి సెటైర్లు

నిజం గెలవడం వల్ల చంద్రబాబుకు బెయిల్ రాలేదని.. కళ్లు కనబడడం లేదని కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. 

Ambati rambabu Satires on Chandrababu naidu Interim bail - bsb

అమరావతి : స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. దీనిమీద వైసీపీ నేత, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబుకు నిజం గెలిచిందని బెయిల్ ఇవ్వలేదని... కళ్లు కనిపించడం లేదని బెయిల్ ఇచ్చారని. ఎక్స్ వేదికగా అంబటి పోస్ట్ చేశారు. 

కాగా, చంద్రబాబు బెయిల్ విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండా అరెస్టు చేసిన విధానాన్ని తప్పు పట్టారు. పురంధరీశ్వరి ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని పురందేశ్వరి అన్నారు. 

చంద్రబాబుకు ఊరట: స్కిల్ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు

ఇదిలా ఉండగా, స్కిల్ స్కాం కేసులో సెప్టెంబర్ తొమ్మిదిన నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు.  53 రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.
వచ్చేనెల 10వ తేదీన  ప్రధాన బెయిల్ పిటిషన్ పై వాదనలో వింటామని హైకోర్టు తెలిపింది. అంతేకాదు నాలుగు వారాల పాటు 
 స్కిల్ స్కామ్ లో మాత్రమే బెయిల్ మంజూరు చేసినట్టుగా హైకోర్టు తెలిపింది. ఆయన ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చని తెలిపింది. 

మరోవైపు, మద్యం కంపెనీలకు చట్ట విరుద్ధంగా చంద్రబాబు అనుమతి ఇచ్చారని సిఐడి నమోదు చేసిన కేసులో మద్యంతర భైలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణకు  ఏపీ హైకోర్టు అనుమతినిచ్చింది.  మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios