అమరావతి: అమరావతిలో భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక వాదనలను విన్పించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పించారు. సీఐడీ అదనపు ఎస్పీ గోపాలకృష్ణ కౌంటర్ దాఖలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ సన్నిహితులు  అమరావతి చుట్టుపక్కల కొనుగోలు చేసిన భూముల వివరాలను డాక్యుమెంట్ల నెంబర్లతో సహా హైకోర్టు ముందు ప్రభుత్వం ఉంచింది.

also read:'వాగ్దానాలను విస్మరిస్తే ప్రజలకు ఎవరు భరోసా కల్పిస్తారు': రాజధాని పిటిషన్లపై తుది విచారణ

రాజధాని నిర్ణయానికే ముందు అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగనివ్వాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు.

ఇవాళ ఈ కేసుకు సంబంధించి విచారణను బుధవారం నాడు వాయిదా వేసింది హైకోర్టు. ఇవాళ ఈ కేసు విచారణ సాగనుంది.రాజధాని నిర్ణయానికే ముందు అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగనివ్వాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు.