జగన్ ఫుల్ జోష్, బొత్స నోటికి తాళం: అసలు లోగుట్టు ఇదే....
రాజధానిపై బొత్స చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పి రప్పించడంతోపాటు ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై కాస్త నెగిటివ్ ప్రచారం వెళ్తుందని భావించిన పార్టీ శ్రేణులు ఇకపై బొత్స నోటికి తాళం వేయించాల్సిందేనని సూచించారట.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును రాజధాని ప్రాంత రైతులు అడ్డుకోవడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉందట. ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైఖరి వల్లో లేక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాటం వల్లో గానీ వైసీపీకి దూరంగా ఉన్నారు రాజధాని రైతులు.
అయితే రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ ఈనెల 25న కీలక నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లువెత్తింది. జగన్ కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులే ఏకంగా ఆయనకు అభినందనలు చెప్పే పరిస్థితికి వచ్చేసింది.
జగన్ కీలక నిర్ణయంతో రాజధాని రైతుల్లో చీలిక వచ్చేసింది. ఒకప్పుడు వైసీపీని అడ్డుకున్న రైతులే నేడు అమరావతికి సృష్టికర్తగా చెప్పుకుంటున్న చంద్రబాబును సైతం అడ్డుకున్నారు. ఇకపోతే రాజధాని అంశాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే ఉందన్న విషయం తెలిసిందే.
Chandrababu Amaravati tour: శంకుస్థాపన చోటును ముద్దాడి చంద్రబాబు భావోద్వేగం
అయితే వైయస్ జగన్ నిర్ణయంతో సీన్ కాస్త రివర్స్ అయ్యింది. రాజధాని ప్రాంత రైతులు వైసీపీ వైపు మెుగ్గు చూపారని భావించిన జగన్ టీం రాజధానిపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇకపై రాజధాని విషయంలో గందరగోళ విమర్శలు చేయకుండా ప్రజలకు, రైతులకు అర్థవంతమైన వివరణ ఇచ్చేలా ప్రయత్నించాలని జగన్ టీం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని భూముల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసింది తమ ప్రభుత్వం ఏం చేయబోతుంది, రైతుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తే సత్ఫలితాలు వస్తాయని భావిస్తోందట.
ఇకపోతే రాజధాని భూములపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న విమర్శలకు చెక్ పెడితే మంచిదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. బొత్స సత్యనారాయణ నోటికి తాళం వేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
దమ్ముంటే టచ్ చేసి చూడండి..?: సీఎం జగన్ కు బీజేపీ ఎమ్మెల్సీ సవాల్
రాజధానిపై బొత్స చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పి రప్పించడంతోపాటు ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై కాస్త నెగిటివ్ ప్రచారం వెళ్తుందని భావించిన పార్టీ శ్రేణులు ఇకపై బొత్స నోటికి తాళం వేయించాల్సిందేనని సూచించారట.
ప్రస్తుతానికి రాజధాని రైతుల్లో వైసీపీ ప్రభుత్వంపై కాస్త సాఫ్ట్ కార్నర్ ఉందని దాన్ని కాపాడుకోవాలంటే వారి విషయంలో సానుకూలంగా వెళ్లడమే మంచిదని వైసీపీ భావిస్తుందట. మెుత్తానికి జగన్ నిర్ణయం ఆ పార్టీలో కొత్త జోష్ నింపుతుండగా, మంత్రి బొత్సకు నోటికి మాత్రం తాళం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
నన్ను కెలికితే ఊరుకుంటానా..?: బాబు పర్యటనపై జగన్ ప్లాన్ గ్రాండ్ సక్సెస్