అమరావతి: ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలియజేస్తానంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయడు అమరావతి పర్యటనకు బయలు దేరారు. 

రాజధాని పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని రైతులు రెండుగా చీలిపోవడంతో ఒక వర్గం చంద్రబాబు నాయుడు పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించింది. 

చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై చెప్పులు రాళ్లతో దాడికి దిగారు. దాంతో చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు దెబ్బతిన్నాయి.  

ఇకపోతే ఉద్దండరాయునిపాలెం చేరుకున్న చంద్రబాబు నాయుడుకు పలువురు రైతులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు చంద్రబాబుపై పూల వర్షం కురిపించారు. అక్కడ కాన్వాయ్ దిగిన చంద్రబాబు 

రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ప్రదేశానికి చేరుకున్నారు. శంకుస్థాపన ప్రదేశంలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ఉన్న నేలతల్లిని ముద్దాడారు. భూమికి సాష్టాంగ నమస్కారం చేశారు చంద్రబాబు నాయుడు.  

"