న్యూడిల్లి: రాజధానిని అమరావతి నుండి తరలించాలన్న సొంత పార్టీ నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏకంగా దేశ రాజధాని డిల్లీ వేదికనే పోరాటానికి సిద్దమయ్యారు. దీంతో ఆయనకు అమరావతి ప్రాంత ప్రజల నుండి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ నేతలు డిల్లీకి వెళ్లిమరీ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఐదు కోట్ల ఆంద్రుల మనోభావాలకు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేయడానికి రఘురామ కృష్ణంరాజును కలిసినట్లు మహిళా నేతలు వెల్లడించారు. 

వీడియో

"