అమరావతిని శాసన రాజధానిగా కూడా కొనసాగించవద్దని తాను సీఎం జగన్ ను కోరినట్లు మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో అమరావతి ప్రాంతంలో మళ్లీ ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి. మంత్రి కొడాలి వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఉద్దండరాయునిపాలెం రైతులు ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని... ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకోవాలని సూచించారు. మంత్రి కొడాలి నానికి ఇప్పటికయినా బుద్ధి రావాలని కోరుకుంటున్నామని అన్నారు. 

వీడియో

"