విజయవాడ: మూడు రాజధానులపై ప్రభుత్వం రెఫరెండం నిర్వహించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. అంతేకాదు  రాజధానుల అంశంపై ప్రభుత్వం మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also read:హైపవర్ కమిటీ సమావేశం...రాజధానిపై చర్చించిన అంశాలివే

విజయవాడ బెంజి సర్కిల్ లో టీడీపీ చీఫ చంద్రబాబునాయుడు బోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను చంద్రబాబునాయుడు బోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Also read:అమరావతి: రాజధాని రైతులకు హైపవర్ కమిటీ ఆఫర్ ఇదీ

జగన్ సర్కార్ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజలు మళ్లీ వైసీపీని ఆదరిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని వైసీపీకి చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు.  అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

అమరావతి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేశారని ఆయన గుర్తు చేసుకొన్నారు.  బాధలో సంక్రాంతి సంబరాలకు ప్రజలు దూరంగా ఉంటే వైసీపీ నేతలు కోడిపందాలు నిర్వహిస్తున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు. బాధలో సంక్రాంతి జరుపుకోవాల్సి వస్తోందని తాను అనుకోలేదని చంద్రబాబునాయుడు అన్నారు. 

వేల సంవత్సరాల క్రితమే అమరావతి కేంద్రంగా రాజ్యం ఉన్న విషయాన్ని బాబు ప్రస్తావించారు.తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడ సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోరని బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.