అమరావతి: రాజధాని రైతులకు హైపవర్ కమిటీ ఆఫర్ ఇదీ
రాజధాని రైతులు తమ డిమాండ్లను ఈ నెల 17వ తేదీలోపుగా సమర్పించాలని హైపవర్ కమిటీ రైతులను కోరింది.
హైదరాబాద్: ఈ నెల 17వ తేదీ లోపుగా రాజధాని రైతులు తమ సమస్యలు, సూచనలు ఇవ్వాలని హై పవర్ కమిటీ రాజధాని రైతులకు సూచించింది.
సోమవారం నాడు హైపవర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సమగ్రాభివృద్ధిపై చర్చించారు. ఈ నెల 17వ తేదీలోపుగా రాజధాని రైతులు తమ సమస్యలను నేరుగా సీఆర్‌డీఏకు చెప్పాలని హైపవర్ కమిటీ సూచించింది.
also read:పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీ: ఆర్ఎస్ఎస్ నేతలతో భేటీ, ఏం జరుగుతోంది?
రాజధాని రైతులు తమ సమస్యలను, సలహలను, సూచలను సీఆర్‌డీఏ దృష్టికి తీసుకురావాలని హైపవర్ కమిటీ కోరింది. ఈ నెల 17వ తేదీ సాయంత్రం మరోసారి హైపవర్ కమిటీ సమావేశం కానుంది. రైతుల సమస్యలు, సూచనలపై హైపవర్ కమిటీ చర్చించనుంది.