అమరావతి రాజధాని కేసు: ఈ నెల 28కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
అమరావతి రాజధానితో పాటు రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్లపై విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అన్ని పిటిషన్లను కలిపి విచారణ నిర్వహించింది.
అమరావతి:రాష్ట్రవిభజన,అమరావతి రాజధాని కేసుల విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర విభజనతో పాటు రాజధానిపై దాఖలైన 35 పిటిషన్లను కలిపి సోమవారంనాడు విచారించింది సుప్రీంకోర్టు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్నితీసుకు రావడంతో అమరావతి జేఏసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారుమూడు రాజధానులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ తో పాటు రాష్ట్ర విభజనపై దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కలిపి విచారించింది.
రాష్ట్ర అభివృద్ది కోసం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చినట్టుగా ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. ఇదే వాదనను ఇవాళ సుప్రీంకోర్టులో కూడా విన్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం తరపున కోరిన సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనుసింఘ్వి, మాజీ ఏజీ వేణుగోపాల్ లు వాదించారు. రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసులను విడివిడిగానే విచారిస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.హైకోర్టులోఅమరావతి రైతులు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లను సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు పిటిషనర్ల తరపున వేణుగోపాల్ .సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యేవరకు హైకోర్టులో ధిక్కార పిటిషన్లపై రైతులు ఒత్తిడి లేకపోవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది.ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మూడు రాజధానులను తెరమీదికి తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతోనే మూడు రాజధానులను తెరమీదికి తీసుకు వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
alsoread:అమరావతి ల్యాండ్ స్కాం .. సిట్ ఏర్పాటుపై సుప్రీంకెక్కిన ఏపీ హైకోర్ట్
అభివృద్ది కేంద్రీకరణ కారణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం సాగిన ఉద్యమాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వైసీపీ సర్కార్ వాదిస్తుంది.అయితే అమరావతిలో రాజధానిని అభివృద్ది చేయాలంటే డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు చేయాల్సిన అవసరం అవుతుందని ఏపీ సర్కార్ చెబుతుంది.అమరావతిలో రాజధాని నిర్మాణానికి కనీసం లక్షకోట్లకుపైగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం వాదిస్తుంది. ఇదిలా ఉంటే అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.పాదయాత్రలో గుర్తింపుకార్డులున్నవారే పాల్గొనాలని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.పాదయాత్రకు మద్దతిచ్చేవారు రోడ్డు పక్కన నిలబడి మద్దతివ్వాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే.మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. విశాఖలో జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జనను నిర్వహించింది.ఈ కార్యక్రమం సమయంలో మంత్రుల కార్లపై జనసేన శ్రేణులు దాడికి దిగిన విషయం తెలిసిందే.