అమరావతి ల్యాండ్ స్కాం .. సిట్ ఏర్పాటుపై సుప్రీంకెక్కిన ఏపీ హైకోర్ట్
అమరావతి భూ స్కాంలో సిట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం మెట్లెక్కింది.
అమరావతి భూ స్కాంలో సిట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం మెట్లెక్కింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ ఏర్పాటు చేసే అధికారం లేదనే అంశాన్ని సవాల్ చేసింది జగన్ ప్రభుత్వం. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
కాగా.. అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని జగన్ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట సిట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం సిట్ ఏర్పాటుపై స్టే విధించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదని తెలిపింది.