హైదరాబాద్: చీరాల ఎమ్మెల్యే  ఆమంచి కృష్ణమోహన్ బుధవారం నాడు హైద్రాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయమే ఆయన టీడీపీకి  రాజీనామా చేశారు.

చీరాల నియోజకవర్గంలో చోటు చేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో  ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్‌బై చెప్పారు.  వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి బుధవారం నాడు  ఆమంచి కృష్ణమోహన్  హైద్రాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో  జగన్‌తో భేటీ అయ్యారు.

చీరాల నియోజకవర్గంలో  టీడీపీ కార్యకర్తలతో  సమావేశం నిర్వహించాలని  ఎమ్మెల్సీ కరణం బలరామ్‌ను చంద్రబాబ ఆదేశించారు. గురువారం నాడు చీరాలలో  పార్టీ కార్యకర్తలతో కరణం బలరామ్ సమావేశం కానున్నారు.

సంబంధిత వార్తలు

ఆమంచి రాజీనామా ఎఫెక్ట్: కరణం బలరామ్‌కు బాబు ఆదేశం

ఫలించని చంద్రబాబు యత్నాలు...వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్..?