Asianet News TeluguAsianet News Telugu

ఆమంచి రాజీనామా ఎఫెక్ట్: కరణం బలరామ్‌కు బాబు ఆదేశం

 చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేయడంతో  ఈ నియోజకవర్గంలో  కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని  ఎమ్మెల్సీ కరణం బలరామ్‌కు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.

tdp mlc karanam balaram will meeting with chirala tdp leaders on feb 13
Author
Ongole, First Published Feb 13, 2019, 10:52 AM IST


ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేయడంతో  ఈ నియోజకవర్గంలో  కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని  ఎమ్మెల్సీ కరణం బలరామ్‌కు చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఇటీవలనే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ భేటీ అయ్యారు. పార్టీ మారే విషయమై తన అనుచరులతో చర్చించిన తర్వాత  నిర్ణయం తీసుకొంటానని ఆయన ఇటీవల ప్రకటించారు.

తాజాగా  ఆయన అనుచరులతో సమావేశమైన తర్వాత టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు టీడీపీకి  రాజీనామా చేస్తునట్టు ఆమంచి కృష్ణమోహన్  బుధవారం నాడు ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ చీఫ్‌కు పంపారు.  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను  ఆమంచి ఇవాళ లోటస్‌పాండ్‌లో కలవనున్నారు.

ఇదిలా  ఉంటే  చీరాలలో పార్టీ కార్యకర్తలతో  సమావేశాన్ని ఏర్పాటు చేయాలని  ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత కరణం బలరామ్‌ను చంద్రబాబునాయుడు ఆదేశించారు. గురువారం నాడు కరణం బలరామ్ చీరాలలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

ఆమంచి పార్టీ మారితే ప్రత్యామ్నాయంపై కూడ టీడీపీ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు త్వరలోనే ఈ నియోజకవర్గానికి ఇంచార్జీని ప్రకటించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

ఫలించని చంద్రబాబు యత్నాలు...వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్..?

 

Follow Us:
Download App:
  • android
  • ios