ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కొద్దిరోజుల క్రితం ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిన మీదట ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు .. ఆమంచిని అమరావతికి పిలిపించుకుని మాట్లాడారు.

సీఎం బుజ్జగింపుల తర్వాత సైలెంట్‌గా ఉన్న కృష్ణమోహన్ తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా సీఎం చంద్రబాబుకు పంపారు.

‘‘చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మరియు ప్రభుత్వ కార్యకలాపాలలో పార్టీ మరియు ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు’’ ఆయన లేఖలో పాల్గొన్నారు. నిన్న రాత్రి చీరాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమంచి కృష్ణమోహన్.. బుధవారం వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది.