చంద్రబాబుకు తలనొప్పి: తేలని ఏవీ, అఖిలప్రియ పంచాయతీ

చంద్రబాబుకు తలనొప్పి: తేలని ఏవీ, అఖిలప్రియ పంచాయతీ

అమరావతి: ఆళ్లగడ్డ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగానే మారింది. మంత్రి అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి తమ తమ వాదనలకే కట్టుబడి ఉండడంతో పంచాయతీ తేలలేదు. 

గురువారంనాడు వారిద్దరు చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే, సమస్యకు పరిష్కారం రాకపోవడంతో రేపు శుక్రవారం మరోసారి సమావేశం కావాలని ఆయన సూచించారు. అఖిలప్రియతోనూ ఏవీ సుబ్బారెడ్డితోనూ ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. 

ఇరువురిపై కూడా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరి పరిస్థితి కూడా బాగాలేదని ఆయన అన్నారు. పార్టీలో గ్రూపులు పెడితే సహించేది లేదని అన్నారు. పదవులు కాదు, పార్టీ ముఖ్యమని భావించాలని అన్నారు. 

ఇగోలు వదిలేయాలని, బేషిజాలకు వెళ్లకూడదని చంద్రబాబు సూచించారు. అహంభావంతో వెళ్తే పార్టీకే కాదు, వ్యక్తులకూ నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే ఏవి సుబ్బారెడ్డి తన పట్టు వీడడం లేదు. మరోవైపు, అఖిలప్రియ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో రాజీ యత్నాలు కష్టంగానే కనిపిస్తున్నాయి.

ఓ వైపు చంద్రబాబుతో ఇరువర్గాలు భేటీ అయిన నేపథ్యంలోనే అఖిల ప్రియ సోదరి మౌనిక రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏవీ సుబ్బారెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page