జిల్లాలో చక్రం తిప్పుదామనుకుంటే నంద్యాల ఉపఎన్నికల రూపంలో సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయ్. దశాబ్దాల వైరి వర్గం గంగుల కుటుంబాన్ని చంద్రబాబునాయుడు టిడిపిలో చేర్చుకోవటం అఖిలకు నిజంగా షాకింగ్ న్యూసే. మాటమాత్రమైనా చెప్పకుండానే గంగులను టిడిపిలోకి చేర్చేసుకున్నారు చంద్రబాబునాయుడు. చంద్రబాబు-గంగుల ప్రతాపరెడ్డి భేటీ జరిగేంత వరకూ విషయం బయటకు పొక్కలేదంటేనే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అర్ధమైపోతోంది.

అఖిలప్రియ పరిస్ధితి చూస్తుంటే నిజంగా పాపం అనిపిస్తోంది. చిన్న వయస్సులోనే ఎంఎల్ఏ, మంత్రి అయిపోయింది. జిల్లాలో చక్రం తిప్పుదామనుకుంటే నంద్యాల ఉపఎన్నికల రూపంలో సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయ్. దశాబ్దాల వైరి వర్గం గంగుల కుటుంబాన్ని చంద్రబాబునాయుడు టిడిపిలో చేర్చుకోవటం అఖిలకు నిజంగా షాకింగ్ న్యూసే.

మాటమాత్రమైనా చెప్పకుండానే గంగులను టిడిపిలోకి చేర్చేసుకున్నారు చంద్రబాబునాయుడు. చంద్రబాబు-గంగుల ప్రతాపరెడ్డి భేటీ జరిగేంత వరకూ విషయం బయటకు పొక్కలేదంటేనే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అర్ధమైపోతోంది.

సరే, గంగుల టిడిపిలో చేరిపోయారు. మరి, టిడిపిలోనే ఉన్న ప్రత్యర్ధి వర్గాల మాటేంటి? ఎందుకంటే, గంగుల కుటుంబానికి భూమా, ఎస్పీవై రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి తదితరులకు ఏమాత్రం పడదు.

ఇపుడదే సమస్యగా మారింది. తనపాటికి తాను గంగులను పార్టీలోకి తీసేసుకున్నారు. కానీ క్షేత్రస్ధాయిలో కలిసి పనిచేయాల్సిన వర్గాల మాటేంటి. అందులోనూ తక్షణ సమస్య మంత్రి భూమా అఖిలప్రియకే.

నంద్యాల ఉపఎన్నిక అఖిలకే పెద్ద పరీక్ష. పట్టుబట్టి తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్టు సాధించుకున్నారు. భూమా నాగిరెడ్డి మృతి తాలూకు సెంటిమెంటు ఉందనుకుని చంద్రబాబు కూడా మంత్రి ఒత్తిడికి తలొంచి టిక్కెట్టు ఇచ్చేసారు.

నిజానికి అక్కడి నుండే అఖిలకు సమస్యలు మొదలయ్యాయి. పార్టీలోనే ఉన్న ప్రత్యర్ధి వర్గాల్లో ఏ వర్గం అభ్యర్ధి గెలుపుకు నిజంగా కృషి చేస్తున్నదీ అర్ధం కావటం లేదు. జనాల్లో వ్యతిరేకత బాహాటంగానే బయటపడుతోంది. మంత్రినే జనాలు నిలదీస్తున్నారు. ఇంకోవైపు వైసీపీ అధక్ష్యుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

ఇటువంటి పరిస్ధితిలోనే మరో ప్రత్యర్ధి గంగుల ప్రతాపరెడ్డిని చంద్రబాబు టిడిపిలో చేర్చుకున్నారు. ఉపఎన్నికలో ఫలితం గనుక తారుమారైతే మంత్రి పరిస్ధితి దయనీయంగా తయారవుతుంది. పైగా, గంగుల ఆళ్ళగడ్డ సీటుపై హామీ తీసుకునే పార్టీలో చేరారని ప్రచారం జరుగుతోంది. అంటే వచ్చే ఎన్నికలో అఖిలకు ఆళ్ళగడ్డలో టిక్కెట్టు అనుమానమే.

నంద్యాల సీటు గెలుచుకోవటం సంగతి దేవుడెరుగు, ముందు ఆళ్ళగడ్డను కాపాడుకోవటమే అఖిలకు పెద్ద సమస్యగా మారిపోతుంది. అసలే సమస్యలతో సతమతమవుతున్న అఖిలకు గంగుల రూపంలో మరో పెద్ద కష్టమొచ్చింది. అందుకే అఖిలను చూస్తున్న వారందరూ అయ్యో పాపమనుకుంటున్నారు.