రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమవారం నాడు  జనసేనలో చేరారు. బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి ఆకుల సత్యనారాయణ ఆదివారం నాడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

అమరావతి: రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమవారం నాడు జనసేనలో చేరారు. బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి ఆకుల సత్యనారాయణ ఆదివారం నాడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆకుల సత్యనారాయణ దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే ఆయన జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగానే ఆకుల సత్యనారాయణ ఆదివారం నాడు బీజేపీకి రాజీనామా చేశారు. 

చాలా కాలంగా ఆకుల సత్యనారాయణ జనసేనతో టచ్‌లో ఉన్నారు. దరిమిలా బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సోమవారం నాడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆకుల సత్యనారాయణ, ఆయన భార్య జనసేనలో చేరారు. 

సంబంధిత వార్తలు

రేపు జనసేనలోకి ఆకుల, బీజేపీకి రాజీనామా

బీజేపీకి షాక్: 21న జనసేనలోకి ఎమ్మెల్యే ఆకుల