రాజమండ్రి: రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆదివారం నాడు రాజీనామా చేశారు. ఆకుల సత్యనారాయణ ఈ నెల 21వ తేదీన  జనసేనలో చేరనున్నారు.

2014 ఎన్నికల సమయంలో  రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుండి ఆకుల సత్యనారాయణ  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేశారు.గత ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ కూటమిగా పోటీ చేశాయి. ఈ కూటమి అభ్యర్ధిగా ఆకుల సత్యనారాయణ పోటీ చేసి విజయం సాధించారు.

సత్యనారాయణ కొంత కాలంగా  ఆయన జనసేనలో చేరాలని భావిస్తున్నారు. సత్యనారాయణ భార్య ఇప్పటికే జనసేనలో చేరారు. ఈ నెల 21 తేదీన ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరనున్నారు.

ఈ మేరకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరో వైపు ఎమ్మెల్యే పదవికి కూడ ఆయన రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అందించనున్నారు.

సంబంధిత వార్తలు

బీజేపీకి షాక్: 21న జనసేనలోకి ఎమ్మెల్యే ఆకుల