రాజమండ్రి: ఈ నెల 21వ తేదీన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో   ఆ పార్టీలో చేరుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. ఇప్పటికే ఆకుల సత్యనారాయణ భార్య జనసేనలో చేరిన విషయం తెలిసిందే.

కొంత కాలంగా ఆకుల సత్యనారాయణ కూడ బీజేపీని వీడి జనసేనలో  చేరుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండిస్తున్నారు.  అయితే ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టారు సత్యనారాయణ.

ఈ నెల 21వ తేదీన జనసేనలో చేరుతున్నట్టు ఆకుల సత్యనారాయణ శుక్రవారం నాడు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయాలని ఆదేశిస్తే తాను అక్కడి నుండి పోటీ చేస్తానని ఆకుల సత్యనారాయణ ప్రకటించారు.

2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా రాజమండ్రి అర్బన్ స్థానం నుండి ఆకుల సత్యనారాయణ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  అయితే ఇటీవల కాలంలోనే ఆయన భార్య జనసేనలో చేరారు. ఈ నెల 21న సత్యనారాయణ కూడ జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.