మంత్రి అఖిల ప్రియ పార్టీ మారుతున్నారా: ఆమె ఏమన్నారు?

First Published 8, Jun 2018, 6:35 PM IST
Akhila Priya says, she will not change party
Highlights

ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే ఆ వార్తలను ఆమె ఖండించారు. తాను ఇతర పార్టీల్లోకి మారడం లేదని అన్నారు. 

తెలుగుదేశం పార్టీ నుంచే తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఆళ్లగడ్డ సీటును ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పెడతానని, ఆ తర్వాతమిగతా విషయాలు ముఖ్యమంత్రి ఇష్టమని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కుతీసుకోబోనని ఆమె స్పష్టం చేశారు. మోదీపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. దేశంలో మహిళలకు, మైనర్ బాలికలు రక్షణ లేదని  అన్నారు అందుకే ఒక మహిళగా, మంత్రిగా ప్రధానిని ఉద్దేశించి మాట్లాడినట్లు తెలిపారు. 

ప్రధానిని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి తనకు లేదని అన్నారు. 13 సంవత్సరాలు దాటిన బాలికలపై రేప్‌ జరిగితే బీజేపీ ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు.

loader