అమరావతి: తన వివాహానికి మంత్రి అఖిలప్రియ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. తనకు కాబోయే జీవిత భాగస్వామి భార్గవ్ కలిసి ఆమె చంద్రబాబు వద్దకు వెళ్లారు.

చంద్రబాబును ఆయన నివాసంలో వధూవరులు కలిశారు. ఆగస్టు 29వ తేదీన ఆళ్లగడ్డలో జరిగే తమ వివాహానికి రావాలని అఖిలప్రియ చంద్రబాబును కోరారు. 

వారిద్దరిని చంద్రబాబు ఆశీర్వదించారు. వరుడి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా ఉన్నారు.

అఖిలప్రియకు భార్గవ్ తో ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.