అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకంలో మరో ముందడుగు

First Published 8, Jun 2018, 6:35 PM IST
agrigold assets auction case
Highlights

అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకంలో మరో ముందడుగు

అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడానికి ఉమ్మడి హైకోర్టు ఆమోదం తెలిపింది. ఇవాళ అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. త్రిసభ్య కమిటీలో జిల్లా కలెక్టర్, రిజిస్ట్రార్, లీగల్ సెక్రటరీ ఉండాలని.. త్రిసభ్య కమిటీతో సీఐడీ కలిసి ఆస్తులు వేలం వేయాలని ధర్మాసనం తెలిపింది.. ఇదే తరహాలో  అన్ని జిల్లాల్లో ఆస్తుల వేలం ప్రక్రియను నిర్వహించాలని.. మొదట గుర్తించిన 10 ఆస్తుల్లో 5 ఆస్తుల వేలానికి పబ్లిసిటీ ఇచ్చిక 6 వారాల్లో ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేసేందుకు జీఎస్ఎల్ గ్రూప్ అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.


 

loader