అమరావతి:సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది ఎం. నాగరఘు బుధవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున ప్రజా ప్రయోజవ్యాజ్యం దాఖలు  చేశారు అడ్వకేట్. రాజుపాలెం మండలం కోట నెమిలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్  జరిగిందని ఆ పిటిషన లో ఆరోపించారు.

ఈ  కేసు విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది. ఈ విషయమై కలెక్టర్ , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్ కు పంపినా కూడ పట్టించుకోలేదని ఆరోపించారు.  ఇప్పటికే మైనింగ్ అధికారులు విచారణ జరిపారని పిటిషనర్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కోర్టుకు పూర్తి వివరాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని న్యాయవాది నాగరఘు చెబుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణ జరిపించాలని ఆదేశించినా పట్టించుకోలేదని న్యాయవాది ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

అక్రమ మైనింగ్ పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.