పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాము పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి తీరతామని టీడీపీ నాయకురాలు, అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు స్పష్టం చేశారు.

పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాము పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి తీరతామని టీడీపీ నాయకురాలు, అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు స్పష్టం చేశారు. కార్యకర్తల కోరిక మేరకు విజయనగరం నియోజకవర్గంలో పోటీ చేస్తామని ఆమె అన్నారు.

అంతకుముందు పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు.. చంద్రబాబు నిర్ణయంతో తీవ్రంగా విబేధించారు. నిర్ణయం తీసుకునే ముందు పార్టీ కేడర్‌తో చర్చించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్ణయాలతో నిజమైన కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవన్నారు.

Also Read:గెలవడం, ఓడటం తర్వాత.. ముందు పోటీ చేయాలి కదా: అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు

ఏకగ్రీవాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఆగిన చోటు నుంచే ఎన్నికలను ప్రారంభించడం ఏమిటని ఎస్‌ఈసీని ప్రశ్నించారు. ఏడాదికిపైగా ఎన్నికలు కొనసాగుతుండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు నిర్ణయాన్ని విబేధిస్తూ ఇప్పటికే సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇకపై ఇన్‌ఛార్జిగానే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. అదితి వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీలో మరింత మంది నేతలు పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొగ్గు చూపుతారని విశ్లేషకుల అంచనా.