పవన్ కల్యాణ్ సిఎం కావడానికి "జబర్దస్త్" ఫార్ములా ఇదే...

పవన్ కల్యాణ్ సిఎం కావడానికి "జబర్దస్త్" ఫార్ములా ఇదే...

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి జబర్దస్త్ ఫేమ్ ఆది పక్కా ప్లాన్ రెడీ చేసినట్లు చెబుతున్నారు. తాను సిద్ధం చేసిన కొత్త ఫార్ములా వల్ల పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నమ్మబలుకుతున్నారు.

తాను సిద్ధం చేసిన ఫార్ములాను పాటిస్తే పవన్ కచ్చితంగా సీఎం అవుతారని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన జనసేన ఐటీ సెల్ సమావేశంలో ఆ విషయం చెప్పారు.
 
ఆది తయారు చేసిన ఫార్ములాలో మొదటిది నెక్స్ట్ సీఎం ఎవరనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం. అందులో మిగిలిన పార్టీల వారిని కూడా చేర్చడం. అందరినీ ప్రభావితం చేసేలా అందులో జనసేన పోస్టులు పెట్టాలని, 8 నెలల తర్వాత ఆ గ్రూపు కాస్తా పవన్ కల్యాణ్ సీఎం అనే గ్రూపుగా మారేలా చేయాలని అన్నారు.
 
అందులో రెండోది - జనసేన కార్యకర్తలు తమ ఇంట్లో వాళ్లను ప్రభావితం చేయడం. జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ్ ఏమిటో తల్లిదండ్రులకు తెలిసేలా చేయాలని ఆయన సూచించారు. తాము ఎందుకు చొక్కాలు చింపుకుంటున్నామో, ఎందుకు ఈలలు వేస్తున్నామో చెప్పాలని అన్నారు.  వేరే పార్టీ పెద్దలకు చెప్పడం కన్నా ఇంట్లో ఉన్న పెద్దలకు చెప్తే వాళ్లు వాళ్లు మాట్లాడుకునే అవకాశం ఉంటుందని, దానివల్ల జనసేన సిద్ధాంతాలు సులభంగా వాళ్లకు అర్థమవుతాయని వివరించాైరు.
 
మూడో విషయానికి వస్తే, గ్రామాల్లో సమావేశాలు పెట్టుకోవడం. కేవలం జనసేన కార్యకర్తలు సమావేశాలు పెట్టుకోవడం కన్నా గ్రామాలకు వెళ్లి సమావేశాలు పెట్టాలని సూచించారు. దీనివల్ల గ్రామీణులను ప్రభావితం చేయవచ్చునని చెప్పారు. 

నాలుగో సూత్రం ఈవెంట్ ఆర్గనైజింగ్. గ్రామీణులకు జనసేన విధానాలు అర్థం కావాలంటే ఇది సరైన విధానమని ఆది అన్నారు. పాటలు, స్కిట్స్ ద్వారా జనసేనే విధానాలు అర్థమయ్యేలా చేయాలని సూచించారు. ఇంటింటికి వెళ్లే కన్నా ఈవెంట్స్ చేస్తేనే మంచిదని అన్నారు. 

ఆదో సూత్రం ఏమిటంటే..అందరిలో విశ్వాసాన్ని కల్పించడం అనింటి కన్నా ముఖ్యమైంది. ప్రజలకు పవన్ కల్యాణ్ పై విశ్వాసం కల్పించడానికి అవసరమైన పనులు చేయాలని సూచించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page