శ్రీరెడ్డికి ఊహించని షాక్

First Published 8, Apr 2018, 6:06 PM IST
Actress Sri reddy asked to vacate house by owner immediately
Highlights
సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌‌లలో నానా హంగామా చేస్తోంది.

క్యాస్టింగ్ కౌచ్ ప్రకటనలతో సంచలనం సృష్టిస్తున్న శ్రీరెడ్డికి ఊహించని షాక్ తగిలింది.  కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్గురించి ఘాటుగా శ్రీరెడ్డి సంచలనమైన లీకులు ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌‌లలో నానా హంగామా చేస్తోంది.

అయితే, తాజాగా శ్రీరెడ్డి శనివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర పై బట్టలు విప్పేసి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.  అదే విషయం తర్వాతే నటికి షాకిచ్చింది.

ఫిల్మ్ ఛాంబర్లో శ్రీరెడ్డి అలా అర్ధనగ్నంగా నానా గొడవ చేసిందో లేదో ఇంటి ఓనర్ ఇలా ట్విస్ట్ ఇచ్చారు. రాత్రికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఓనర్ పిలిచి ఆమెను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా చెప్పారట. ఆ విషయాన్ని ఆమే స్వయంగా తన ఫేస్ బుక్ లో వెల్లడించింది.

మా ఇంటి ఓనర్ నన్ను పిలిచి ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. ఎంత గొప్పో వ్యక్తో చూడండి..ఆయన ఓ ఐఏఎస్ ఆఫీసర్..మనస్సనేది లేని మనుషులు..ఎంత మొరటుగా మాట్లాడారో కనీసం మీరు ఊహించను కూడా లేరు..బడాబాబుల ఆట మొదలైంది’’ అంటూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది.

loader