తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదోని పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనే కక్షతో మహేశ్వరి తండ్రి, పెదనాన్నలు అల్లుడు ఆడమ్ స్మిత్‌ను హత్య చేశారు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదోని పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనే కక్షతో మహేశ్వరి తండ్రి, పెదనాన్నలు అల్లుడు ఆడమ్ స్మిత్‌ను హత్య చేశారు.
తలపై బలంగా కొట్టడంతో మృతి చెందాడని పోస్ట్‌మార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారు. నిందితులపై అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు, రిమాండ్‌కు తరలించారు.
కాగా, ఆదోని పట్టణం కిష్టప్పనగర్‌కు చెందిన ఆడం స్మిత్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. అయితే మహేశ్వరి, ఆడం స్మిత్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
వేర్వేరు సామాజికవర్గాలు కావడంతో వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వాళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత స్మిత్ దంపతులు కిష్టప్పనగర్‌లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం స్మిత్ తన విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా ఆర్టీసీ కాలనీ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు స్మిత్‌పై దాడి చేశారు. ఇనుపరాడ్లు, బండరాయితో తలపై బలంగా మోది హతమార్చారు.
