అమరావతి: కృష్ణా జిల్లా నందిగామ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ తోట శోభనాద్రి అటెండర్ బండ్ల సుధీర్ ని తిరిగి విధుల్లో చేర్చేందుకు 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించాడు. 

వీడియో

"

దీంతో రంగంలోకి దిగిన ఏసీబి అధికారులు లంచాలను మరిగిన సినియర్ అసిస్టెంట్ ఆట కట్టించారు.  సుధీర్ నుండి లంచం తీసుకుంటుండగా శోభనాద్రిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. అతడి నుండి డబ్బును స్వాదీనం చేసుకున్న ఏసిబి అధికారులు శోభనాద్రికి విచారించి మరింత సమాచారాన్ని సేకరించారు.