Asianet News TeluguAsianet News Telugu

ఏసిబి వలలో ఎక్సైజ్ ఎస్సై, గోనె సంచుల్లో రూ.500 నోట్ల కట్టలు,బ్యాంక్ పాస్ బుక్కులు

చిత్తూరు జిల్లాలో ఓ ఎక్సైజ్ పోలీస్ ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారంతో అవినీతి నిరోదక శాఖ అధికారులు ఎక్సైజ్ ఎస్సై ఇంట్లో తనికీలు చేపట్టారు. ఈ దాడిలో సంచుల కొద్దీ నగదు, బ్యాంక్ పాస్ బుక్కులతో పాటు ఆస్తుల పత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.

ACB Raids on Excise si House in chittoor
Author
Chittoor, First Published Aug 10, 2018, 11:56 AM IST

చిత్తూరు జిల్లాలో ఓ ఎక్సైజ్ పోలీస్ ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారంతో అవినీతి నిరోదక శాఖ అధికారులు ఎక్సైజ్ ఎస్సై ఇంట్లో తనికీలు చేపట్టారు. ఈ దాడిలో సంచుల కొద్దీ నగదు, బ్యాంక్ పాస్ బుక్కులతో పాటు ఆస్తుల పత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.

కర్నూల్ జిల్లా నాగులాపురం చెక్ పోస్టులో ఎక్సైజ్ ఎస్సైగా విజయ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా కాజూరులోని ఆయన నివాసంతో పాటు మరో ఐదు చోట్ల ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బైటపడ్డాయి. ఈ ఆస్తుల మార్కెట్ విలువ రూ.25 నుండి రూ.30 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఓ ఐదు గోనె సంచుల్లో రూ. 500 నోట్ల కట్టలతో పాటు భారీ నగదును కలిగివున్న బ్యాంకు పాస్ బుక్ లను అధికారులు గుర్తించారు.

విజయ్ కుమార్ పలు మద్యం దుకాణాలను బినామీ పేర్లతో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన ఓ స్పిరిట్ కంపనీని కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. యాదగిరి మండలంలో ఆరెకరాల వ్యవసాయ భూమిని కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇలా ఆయన అవినీతికి పాల్పడుతూ అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్లల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గతంలోనూ విజయ్ కుమార్ పై పలు అవినీతి ఆరోపనలున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో ఇతడు కూడా నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతడు గతంలో పనిచేసిన ప్రాంతాల్లో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఎసిబి సోదాలు ముగిసేలోపు మరిన్ని ఆస్తులు బైటపడే అవకాశం ఉంది. 
 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios