విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ చాలా పటిష్టంగా ఉందని ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం ఏసీబీ డీజీగా పదవీబాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖను నిరోధించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. 

అవినీతి నిర్మూలళనకు ప్రజల సహకారం చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు. ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. 

ఇకపోతే ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అతనిని బదిలీ చేసింది. ఎన్నికల సమయంలో విధుల నుంచి తప్పించింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఏబీ వెంకటేశ్వరరావును ఏసీబీ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం ఆయన పదవీబాధ్యతలు స్వీకరించారు.