బాబుకు షాక్:లీగల్ ములాఖత్ పెంచాలని దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు
లీగల్ ములాఖత్ లను పెంచాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు ఇవాళ కొట్టివేసింది.
అమరావతి:లీగల్ ములాఖత్ లను పెంచాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను శుక్రవారంనాడు ఏసీబీ కోర్టు కొట్టివేసింది.చంద్రబాబు లీగల్ ములాఖత్ లను రెండు నుండి ఒక్కటికే కుదిస్తూ రాజమండ్రి జైలు అధికారులు ఈ నెల 17న నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీకి ముందుగా రోజుకు రెండు దఫాలు న్యాయవాదులు సమావేశమయ్యే అవకాశం కావడానికి అవకాశం ఉంది.
భద్రతా కారణాలతో పాటు చంద్రబాబు లీగల్ ములాఖత్ ను రోజుకు ఒక్కసారే అనుమతిస్తూ రాజమండ్రి జైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే లీగల్ ములాఖత్ లను మూడుకు పెంచాలని కోరుతూ చంద్రబాబు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ లో ప్రతివాదుల పేర్లను చేర్చలేదని ఈ పిటిషన్ పై విచారణ అవసరం లేదని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది.ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. సరైన లీగల్ ఫార్మెట్ లో పిటిషన్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు చంద్రబాబు న్యాయవాదులకు సూచించింది.
also read:ఏపీ ఫైబర్ నెట్ కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబునాయుడు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసుల్లో కూడ చంద్రబాబు పేర్లున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ లో చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్ కు ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టును చంద్రబాబు న్యాయవాదులు ఆశ్రయించారు.
also read:ఇక నుండి రోజుకు ఒక్కసారే:చంద్రబాబుతో లీగల్ టీమ్ ములాఖత్ ల కుదింపు
వరుస కేసుల నేపథ్యంలో చంద్రబాబును ప్రతి రోజూ రెండు మూడు దఫాలు న్యాయవాదులు కలవాల్సిన అవసరం వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.అయితే భద్రతా కారణాలతొో పాటు చంద్రబాబు ములాఖత్ ను కుదించడంతో ఇబ్బంది అవుతుందన్నారు. న్యాయవాదులకు కనీసం 40 నుండి 50 నిమిషాలు కలిసేలా అనుమతించాలని చంద్రబాబు లాయర్లు కోరుతున్నారు. కానీ ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో మరోసారి ఈ విషయమై కోర్టును ఆశ్రయించనున్నారు చంద్రబాబు లాయర్లు