చంద్రబాబుకు షాక్: రైట్ టూ ఆడియెన్స్ పిటిషన్లు డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన రైట్ టూ ఆడియెన్స్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది.
 

 ACB Court Dismisses Ritht to Audience  Petition lns

అమరావతి:చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన రైట్ టూ ఆడియెన్స్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు  బుధవారంనాడు డిస్మిస్ చేసింది.ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు లాయర్లు  వేసిన రైట్ టూ ఆడియెన్స్ పిటిషన్ ను  ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కేసు వివరాలు, ఎంతమందిని అరెస్ట్ చేశామన్న విషయాన్ని జడ్జికి సీఐడీ తరపు న్యాయవాది వివేకా వివరించారు

. చంద్రబాబు కేసులోపై ఏపీ సీఐడీ తరపు లాయర్లు వాదనలపై  తమకు కూడ అవకాశం కల్పించాలని  రైట్ టూ ఆడియెన్స్ పిటిషన్లను  దాఖలు చేశారు. అయితే  ఈ పిటిషన్లను  ఏసీబీ కోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది.ఈ నెల  6వ తేదీన  చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.  అయితే ఈ పిటిషన్లను  ఏసీబీ కోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది. తమ వాదనలు విన్న తర్వాతే  పీటీ వారంట్లపై వాదనలు వినాలని  చంద్రబాబు తరపు న్యాయవాదులు  రైట్ టూ ఆడియెన్స్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లను  ఏసీబీ కోర్టు ఇవాళ కోర్టు ఆదేశించింది. 

also read:ఐఆర్ఆర్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట: అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశం

ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టుగా  సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కేసులో చంద్రబాబును కూడ విచారించాల్సిన అవసరం ఉందని  సీఐడీ తరపు న్యాయవాది వివేకా వాదించారు. గతంలో  ఈ కేసులో అరెస్టైన  నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు  చంద్రబాబును కూడ విచారించాల్సిన అవసరం ఉందని  సీబీఐడీ తరపు న్యాయవాది ఏసీబీ కోర్టులో వాదనలు విన్పించారు. 

ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు నిందితుడని  సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పోరేషన్ చైర్మెన్ గా  వేమూరి హరి ప్రసాద్ ను నియమించాలని చంద్రబాబు అధికారులకు లేఖ రాశాడని సీఐడీ ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను కూడ కోర్టుకు  సీఐడీ తరపు న్యాయవాది అందించారు. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యాక నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టారని సీఐడీ తరపు న్యాయవాది  వాదించారు. 

నిబందనలు  ఉల్లగించి టేరాసాఫ్ట్ కంపెనీని టెండర్లు ఇచ్చారని  సీఐడీ వాదించింది.2015లోనే గత ప్రభుత్వం టెరాసాఫ్టును  ఏడాది పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టిందన్నారు.దురుద్దేశ పూర్వకంగా బ్లాక్ లిస్ట్ నుంచి టేరాసాఫ్ట్ ను తొలగించారని సీఐడీ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సీఐడీ తరపు వాదనలు పూర్తైన తర్వాత  చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు విన్పిస్తారు. చంద్రబాబు తరపున  పోసాని వెంకటేశ్వర్లు, దమ్మాలపాటి  వెంకటేశ్వర్లు వాదనలు విన్పించనున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios