ఐఆర్ఆర్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట: అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశం
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసుల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు తాత్కాలిక ఊరట లభించింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది హైకోర్టు. మరో వైపు అంగళ్లు కేసులో రేపటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇవాళ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతేకాదు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను కూడ కొట్టివేసిన విషం తెలిసిందే. దీంతో నిన్న ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిళ్ల కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
also read:ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు: నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు
చంద్రబాబు న్యాయవాదులు. అయితే లంచ్ మోషన్ ను పిటిషన్ ను ఏపీ హైకోర్టు నిన్న నిరాకరించింది. దీంతో ఇవాళ ఏపీ హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చంద్రబాబు న్యాయవాదులు కోర్టును అభ్యర్ధించారు.ఇవాళ మధ్యాహ్నం నుండి ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు జరిగాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు చంద్రబాబు అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. అంగళ్లు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్ట్ చేయవద్దని కోరింది. అంగళ్లు కేసుపై ఏపీ హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. అంగళ్లు కేసులో పలువురు టీడీపీ నేతలకు ముందస్తు, రెగ్యులర్ బెయిళ్లు కూడ వచ్చిన విషయం తెలిసిందే.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబును గత నెల 9వ తేదీన అరెస్ట్ చేసింది.ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. అరెస్టైన నాటి నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు ఉన్న విషయం తెలిసిందే.