Asianet News TeluguAsianet News Telugu

ఆరా ఎగ్జిట్ పోల్స్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం

ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120స్థానాల్లో గెలవబోతుందని స్పష్టం చేశారు. ఇకపోతే అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 50 స్థానాల్లోనే విజయం సాధిస్తోందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఫలితాల విషయానికి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ కేవలం 5 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టం చేసింది. 

aaraa exit poll results:ysrcp form government
Author
Hyderabad, First Published May 19, 2019, 6:16 PM IST

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫెక్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించిన ఆరా సంస్థ ఈసారి ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వేకు పూర్తి భిన్నంగా ఇచ్చింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అధికారం వస్తుందని స్పష్టం చేసింది. 

ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120స్థానాల్లో గెలవబోతుందని స్పష్టం చేశారు. ఇకపోతే అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 50 స్థానాల్లోనే విజయం సాధిస్తోందని స్పష్టం చేసింది. 

ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఫలితాల విషయానికి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ కేవలం 5 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టం చేసింది. ఇకపోతే ఆరా సంస్థ 2009 నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తోంది. 

ఆనాటి నుంచి ఆరా సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఇకపోతే ఉత్కంఠ రేపిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 85కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తోందని తెలిపింది. 

ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 డివిజన్లలో గెలుస్తుందని ఆరా స్పష్టం చేసింది. అలాగే టీఆర్ఎస్ భారీ విజయాన్ని అందుకుంది. 

అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేర్గాంచిన నగరి ఎమ్మెల్యే రోజా ఈసారి ఓడిపోతుందని సర్వేలో తేల్చి చెప్పింది. రోజా ఓటమికి పారట్ీలోని కీలక నేతలే కారణమని కూడా స్పష్టం చేసింది. 

1. 2019 శాసన సభ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు:

వ.నం     పార్టీ పేరు                                 గెలిచేస్థానాల సంఖ్య   పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం

1.          తెలుగుదేశం                                     50                                       5

2.        వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ                 120                                         5

3.       జనసేన పార్టీ                                        0                                 0

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అయితే జనసేన పార్టీ ఒక్కచోట కూడా గెలవదని ఆరా ఎగ్జిట్ పోల్ లో స్పష్టం చేసింది.

2. 2019 ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు:

వ.నం           పార్టీ పేరు                              గెలిచే స్థానాల సంఖ్య                పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం

1.               తెలుగుదేశం                                 5                                                     0

2.               వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ             20                                                      0

3.              జనసేన పార్టీ                                     0                                                0
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి. అయితే గతంతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎంపీలను గెలుచుకున్నట్లు ప్రకటించింది. కానీ జనసేన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కడా బోనీ కొట్టదని స్పష్టం చేసింది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఎలైట్ ఎగ్జిట్ పోల్ సర్వే: టీడీపీదే విజయం

టీడీపీకి 100 దాటనున్న అసెంబ్లీ స్థానాలు: లగడపాటి ఎగ్జిట్ పోల్‌ సర్వే

Follow Us:
Download App:
  • android
  • ios