20 ఏళ్ల పాటు అమ్మా అని పిలిపించుకోవాలని ఆరాటపడ్డా ఆ మహిళ.. ముగ్గురికి జన్మనిచ్చి అనంతలోకాలకు వెళ్లిపోయింది. సీజేరియన్ జరిగిన కొన్ని రోజుల్లోనే ఆమె చనిపోయింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఆమెకు పెళ్లయి 20 సంవత్సరాలు అయ్యింది. వివాహమైన మొదటి నుంచి ఆమె పిల్లల కోసం ఎన్నో కలలు కన్నది. అమ్మా అని పిలించుకోవాలని ఎంతో ఆరాట పడింది. ఎందరో దేవుళ్లకు మొక్కింది. ఎందరో డాక్టర్లను సంప్రదించింది. ఎన్నో ఏళ్ల ఎదురుచూపు తరువాత ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమె సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. అయితే ఆమె కోరిక మాత్రం నెరవేరలేదు. ప్రసవించిన కొన్ని రోజుల్లోనే ఆ తల్లి కన్నబిడ్డలను వదిలి అనంతలోకాలకు వెళ్లిపోయింది.

తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీలో పొగలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు

ఎందరినో విషాదంలో ముంచెత్తిన ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో చోటు చేసుకుంది. మండలంలోని పల్లగిరికి గ్రామానికి చెందిన ఖాసీం, షేక్ నజీరా (35) దంపతులు. వీరికి 20 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. ఖాసీం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఈ దంపతులు పెళ్లయిన నాటి నుంచి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి సంతానం కలగలేదు. 

అనేక హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. చివరికి కొన్ని నెలల కిందట నజీరా గర్భం దాల్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. 20 ఏళ్ల తరువాత తమ కుటుంబంలోకి పిల్లలు రాబోతున్నారని ఆ దంపతులు కూడా ఎంతో సంబరపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేకపోయింది. 

కార్టూన్లు చూస్తూ టీవీ సెట్ టాప్ బాక్స్ ను తాకిన 4 ఏళ్ల బాలుడు.. కరెంట్ షాక్ రావడంతో మృతి

నజీరాకు పది రోజుల కిందట పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ప్రసవం కోసం ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడి డాక్టర్లు ఆమెకు సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో నజీరా ముగ్గురు పిల్లలకు జన్మనించింది. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. మరొకరు అబ్బాయి ఉన్నారు. అయితే నజీరాకు రక్తం తక్కువగా ఉందని డాకర్లు చెప్పారు. దీంతో రక్తం కూడా ఆమెకు ఎక్కించారు. 

జాక్ పాట్ కొట్టాడు.. వరించిన రూ.13 వేల కోట్ల లాటరీ.. ఎవరికంటే ?

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె పరిస్థితి విషమించింది. మంగళవారం రాత్రి నజీరా చనిపోయింది. పిల్లలు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నజీరా మృతదేహాన్ని పల్లగిరికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేపట్టారు. ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడంతో పది రోజుల కిందట ఎంతో ఆనందపడ్డ ఆ కుటుంబం అంతలోనే తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఆ గ్రామం కూడా శోక సంద్రంలో మునిగిపోయింది.