అతడు గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్నాడు. తన బంధువు అయిన ఓ బాలిక పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. అతడి నుంచి తప్పించుకొని తల్లి వద్దకు చేరుకుంది.

ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలికపై గ్రామ వాలంటీర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి నిందితుడి నుంచి తప్పించుకొని తన తల్లి దగ్గరికి చేరుకుంది. అనంతరం వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు.

ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి.. కాశ్మీర్ లోని కుల్గాంలో ఘటన..

వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే గురువారం రాత్రి బాలిక తన ఇంట్లో ఉంది. రాత్రి 9.10 గంటల ప్రాంతంలో బాలిక తల్లి గ్రామంలోని ఓ వేడుక వద్దకు వెళ్లారు. బాధితురాలు ఒంటరిగా ఉండటాన్ని ఆమె బంధువు గుంటూరి అశోక్ గమనించాడు. అతడు గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్నాడు. 

మద్యం తాగేందుకు పెన్షన్ డబ్బులివ్వాలని తండ్రితో గొడవ.. రూ.100 ఇవ్వలేదని హత్య..

ఇంట్లోకి ప్రవేశించి ఆమె చేయిపట్టుకున్నాడు. బాలికపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బాలిక అతడిని అడ్డుకుంది. భయంతో గట్టిగా కేకలు వేసింది. నిందితుడి నుంచి ఎలాగోలా తప్పించుకుంది. అనంతరం తన తల్లి వద్దకు చేరుకుంది. తనపై అశోక్ చేయబోయిన దారుణాన్ని వివరించింది. బాధితురాలి, ఆమె తల్లి కలిసి శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై ఫిర్యాదు చేశారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో విచారణ జరుగుతోంది.

కొత్త కారు కొన్నందుకు స్నేహితులకు పార్టీ.. తిరిగి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి.. అనంతపురంలో ఘటన

బాపట్ల జిల్లాలోని మే 31వ తేదీన ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామ వాలంటీర్ 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా మూడు నెలల పాటు ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొరిశపాడు మండలంలో రావిపాటి కోటయ్య వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అతడికి పెళ్ళయి భార్యతో కలిసే వుంటున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన 15ఏళ్ల మైనర్ బాలికపై కన్నేసాడు. ఆమె తండ్రిదండ్రులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లడంతో బాలిక అమ్మమ్మ వద్దే వుంటోంది.

దారుణం.. 10 ఏళ్ల బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ అత్యాచారం.. కేక్ తినిపించి, గదిలో నుంచి బయటకు పంపిన కామాంధుడు..

ఆ బాలికకు మాయమాటలు చెప్పి బాలికతో పరిచయం పెంచుకున్న కోటయ్య.. మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొందంటూ బెదిరించాడు. కొంత కాలం పాటు మౌనంగా ఉన్న బాలిక.. అతడి వికృతచేష్టలు మరీ ఎక్కువ కావడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు పోక్సో చట్ట కింద బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వాలంటీర్ పై కేసు నమోదు చేశారు. బాలికను వైద్యపరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు.