ఓ గర్భిణికి సిజేరియన్ చేసిన డాక్టర్.. కడుపులోనే కత్తెర మర్చిపోయారు. కడుపునొప్పితో బాధపడుతున్న ఆ బాలింతకు ఎక్స్ రే తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో జరిగింది.
ఓ గర్భిణి ప్రసవం కోసం హాస్పిటల్ కు వచ్చింది. దీంతో అక్కడి డాక్టర్ ఆమెకు సిజేరియన్ చేశారు. అయితే కుట్లు వేసే ముందు కడపులోనే కత్తెర మర్చిపోయారు. తరచూ కడుపు నొప్పి వేస్తుండటంతో ఆ మహిళా మళ్లీ హాస్పిటల్ కు వెళ్లింది. దీంతో అక్కడి సిబ్బంది ఆమెకు ఎక్స్ రే తీశారు. అందులో కత్తెర ఉన్నట్టు బయటపడింది. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది.
ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు లేకపోతే.. లైంగిక దాడి కాదనడం సరికాదు: ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు వారం రోజుల కిందట ఓ గర్భిణి వచ్చింది. దీంతో అక్కడి ఓ సీనియర్ సివిల్ సర్జన్ ఆధ్వర్యంలో ఆమెకు ప్రసవం జరిగింది. ఆ సర్జన్ గర్భిణికి సిజేరియన్ చేసి, శిశువును బయటకు తీశారు. కానీ ఆ మహిళ కడుపులోనే కత్తెర మరిచిపోయి, పొరపాటున అలాగే కుట్లు వేసేశారు. అయితే ఆ తల్లికి బిడ్డ జన్మించిన సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయింది.
బిల్లులు రావడం లేదని.. మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. నిజామాబాద్ లో ఘటన
ఎందుకంటే ఆమెకు డెలివరీ అయిన నాటి నుంచి తీవ్ర కడుపునొప్పి మొదలైంది. దీంతో డాక్టర్లు ఎక్స్ రే తీయాలని సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు మేరకు అక్కడి సిబ్బంది బాలింతకు ఎక్స్ రే తీశారు. దీంతో అందులో కత్తెర ఉందని సిబ్బంది, డాక్టర్లు గుర్తించి కంగారుపడ్డారు. ఈ విషయం బయటకు వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన చెందారు. దీనిని బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మద్యం బిల్లు చెల్లించే విషయంలో గొడవ.. క్రికెట్ స్టంప్, కత్తితో దాడి చేసుకున్న కాబోయే డాక్టర్లు..
కానీ ఆ హాస్పిటల్ లో పని చేసే ఓ ఉద్యోగి.. కడుపులో కత్తెర స్పష్టంగా కనిపిస్తున్న ఎక్స్ రే ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. దీంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే ఆ ఉద్యోగిని హాస్పిటల్ అధికారులు తమ వద్దకు పిలిపించుకున్నారు. ఇలా ఎందుకు చేశావని మందలించారు. దీంతో తన సోషల్ మీడియా ఖాతా నుంచి వాటిని డిలీట్ చేశాడు. అలాగే హాస్పిటల్ లో బాధితురాలి వివరాలు కూడా తొలగించారని తెలుస్తోంది. కానీ అదే హాస్పిటల్ తీసిన ఎక్స్ రేపై అన్ని వివరాలు కనిపిస్తున్నాయి.
ఒక వైపు చదువు.. ఇంకోపైపు వ్యాపారం.. ‘ఫార్మ్ టూ ప్లేట్’ ఐడియాతో వచ్చిన స్టార్టప్ సక్సెస్ స్టోరీ..!
కాగా.. పొరపాటున కత్తెర మరిచిపోయిన డాక్టర్.. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని ఆ హాస్పిటల్ లోని ఓ ఉన్నతాధికారిని రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆయన ఈ ఘటనను బయటకు రాకుండా చూసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ విషయం తనకు తెలియదని ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ ‘ఆంధ్రజ్యోతి’తో తెలిపారు. తాను ప్రస్తుతం సెలవులో ఉన్నట్టు చెప్పారు.
