ఇంటిముందు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి.. అత్యాచారానికి పాల్పడ్డాడో 69యేళ్ల వృద్ధుడు. అతనికి విశాఖ కోర్టు 20 యేళ్ల జైలు శిక్ష విధించింది. 

విశాఖపట్నం : ఏడేళ్ల బాలికకు చాక్లెట్ ఆశచూపి లైంగిక దాడికి పాల్పడిన కేసులో 69యేళ్ల వ్యక్తికి 20యేళ్ల కఠిన కారాగారశిక్ష పడింది. పోక్సో (లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం) కేసులో 69 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ప్రత్యేక న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. నగర పోలీసులు 24 నెలల్లో నిందితులను దోషులుగా నిర్ధారించిన ఆధారాలను కోర్టు ముందుంచారు.

ఈ కేసుకు సంబంధించి.. నగర పోలీసు కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం, ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌బి కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్‌టిసి ఉద్యోగి సారిక వెంకట రమణ అలియాస్ విజయ్ రాజు అలియాస్ చాక్లెట్ అంకుల్ ఈ నేరానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన డిసెంబర్ 15, 2020 న జరిగింది. నిందితుడు పిల్లలకు చాక్లెట్లు ఆశచూపి తన ఇంటికి తీసుకెళ్లేవాడు. అలాగే ఏడేళ్ల బాలిక 2020 డిసెంబర్ 15న మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన ఇంటి బయట ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తానని ఆమెకు ఆశపెట్టి పిలిచాడు. 

4.6 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల‌ విద్యార్థులకు ట్యాబ్లెట్స్ పంపిణీ చేయనున్న సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి..

అలా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం పని నుండి తిరిగి వచ్చిన బాధిత బాలిక తల్లి విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతని మీద ఐపీసీ సెక్షన్లు 366, 376, సెక్షన్ 6 POCSO చట్టం 2012లోని 5 (ఎం)తో సెక్షన్ల కింద ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.పోలీసులు అన్ని ఆధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

"నగర పోలీసు చీఫ్ సిహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు, డిసిపి క్రైమ్ వింగ్ జి నాగన్న పర్యవేక్షణలో ప్రత్యేక కోర్టులో సాక్షులను హాజరుపరిచారు. మహిళా ఎస్ఐ కె నీలిమ, దిశ మహిళా సిబ్బంది సహాయంతో సాక్ష్యాధారాలను పక్కదారి పట్టకుండా ప్రయత్నించాం’ అని దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ సీహెచ్ వివేకానంద తెలిపారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్-పోక్సో కోర్టు, విశాఖపట్నం, కరణం కృష్ణ, ఈ కేసును గట్టిగా సమర్పించి, నిందితుడి నేరాన్ని విజయవంతంగా నిరూపించారు. పోర్టు సిటీ పోలీస్ బాస్ శ్రీకాంత్ దీన్ని ప్రాధాన్య కేసుగా తీసుకుని కోర్టులో రోజువారీ విచారణలను పర్యవేక్షించారు.

అంతకుముందు.. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో 73 ఏళ్ల కోలాటి బాలయోగిని అక్టోబర్ 17న కోర్టు దోషిగా నిర్ధారించడంతో పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇలాంటి కేసు రెండు నెలల్లో ఇది రెండో కేసు. ఈ సంఘటన 2022 మార్చి 23న జరిగింది. ఆ కేసులో ఏడు నెలల్లోనే నిందితులను దోషులుగా నిర్ధారించి సిటీ పోలీసులు విజయం సాధించారు.