ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,901 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,57,587కి చేరింది.

నిన్న ఒక్క రోజే వైరస్ కారణంగా 67 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 4,846కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 95,733 యాక్టివ్ కేసులున్నాయి.

నిన్న ఒక్క రోజే 10,292 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 4,57,008కి చేరుకుంది. గత 24 గంటల్లో 75,465 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 45,27,593కి చేరింది.

నిన్న ఒక్క రోజే అనంతపురం 680, చిత్తూరు 932, తూర్పుగోదావరి 1,398, గుంటూరు 479, కడప 792, కృష్ణ 467, కర్నూలు 505, నెల్లూరు 711, ప్రకాశం 1,146, శ్రీకాకుళం 555, విశాఖపట్నం 584, విజయనగరం 583, పశ్చిమగోదావరిలలో 1,069 కేసులు నమోదయ్యాయి.

అలాగే గత 24 గంటల్లో కడప 9, చిత్తూరు 8, ప్రకాశం 8, నెల్లూరు 7, గుంటూరు 6, కృష్ణ 5, కర్నూలు 5, విశాఖపట్నం 5, పశ్చిమ గోదావరి 4, అనంతపురం 3, తూర్పుగోదావరి 3, శ్రీకాకుళం 2, విజయనగరంలో ఇద్దరు చొప్పున మరణించారు.