ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. శనివారం కొత్తగా 9,276 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 50 వేల 209కి చేరుకున్నాయి.

ఇవాళ కోవిడ్‌తో 59 మంది మరణించడంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,407కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 72,188 యాక్టివ్ కేసులు ఉండగా.. 76,614 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనా టెస్టుల సంఖ్య 20 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 60,797 మందికి టెస్టులు నిర్వహించారు.

ఇవాళ కర్నూలు జిల్లాలో అత్యథికంగా 1234 కేసులు వెలుగు చూశాయి. శనివారం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో 8 మంది, గుంటూరు 7, అనంతపురం, చిత్తూరు, కర్నూలుల్లో ఆరుగురు చొప్పున, శ్రీకాకుళం 4, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలలో ఇద్దరు చొప్పున కరోనాతో మృతి చెందారు. 

జిల్లాల వారీగా కేసులు

అనంతపురం - 1128
చిత్తూరు - 949
తూర్పుగోదావరి -876
గుంటూరు -1001
కడప -547
కృష్ణా -357
కర్నూలు -1234
నెల్లూరు -559
ప్రకాశం - 402
శ్రీకాకుళం - 455
విశాఖపట్నం - 1155
విజయనగరం -119
పశ్చిమ గోదావరి - 494