న్యూఢిల్లీ:  ఎన్నికల్లో ఎంత ఖర్చు చేసిన విషయమై దేశంలోని 80 మంది ఎంపీలు ఇంతవరకు లెక్కలు చూపలేదు. ఎన్నికల వాచ్ అనే సంస్థ ప్రకటించింది. లెక్కలు చూపని ఎంపీల్లో  తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలు ఉన్నారు. ఏపీ రాష్ట్రానికి చెందిన వారు 15 మంది ఉంటే, తెలంగాణ కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు.

ఎన్నికలు పూర్తైన తర్వాత 90 రోజుల్లో ఎంపీలు ఎన్నికల సంఘానికి ఎన్నికల్లో చేసిన ఖర్చలను అందించాల్సి ఉంటుంది. అయితే ఇంతరకు 80 మంది ఎంపీలు మాత్రం ఎన్నికల సంఘానికి లెక్కలు చూపలేదని నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ ప్రకటించింది.

రెండు తెలుగు రాష్ట్రాల నుండి  17 మంది ఎంపీలు ఎన్నికల సంఘానికి లెక్కలు చూపలేదని నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ తేల్చి చెప్పింది.  ఏపీ రాష్ట్రానికి చెందిన 15 మంది ఎంపీల్లో 13 మంది ఎంపీలు వైసీపీకి చెందినవారు లెక్కలు చెప్పలేదు. ఇద్దరు  టీడీపీ ఎంపీలు కూడ ఎన్నికల సంఘానికి లెక్కలు చెప్పలేదని తేల్చి చెప్పారు. 

వైసీపీకి చెందిన రఘురామకృష్ణంరాజు, మాధవి, ఎంవీవీ సత్యనారాయణ, వైఎస్ అవినాష్ రెడ్డి, పి. మిథున్ రెడ్డి, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్, వెంకట సత్యవతి, పోచ బ్రహ్మనందరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, సంజీవ్ కుమార్, లావు శ్రీకృష్ణదేవరాయ, శ్రీనివాస్ రెడ్డిలు  ఎన్నికల సంఘానికి ఎన్నికల ఖర్చులను ఇవ్వలేదు. ఇక టీడీపీకి చెందిన గల్లా జయదేవ్, కింజారపు రామ్మోహన్ నాయుడులు ఉన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపీలు కూడ ఎన్నికల సంఘానికి తమ ఖర్చుల వివరాలను  చెప్పలేదు. నిజామాబాద్ నుండి బీజేపీ నుండి విజయం సాధించిన ధర్మపురి అరవింద్, మెదక్ నుండి విజయం సాధించిన టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిలు ఎన్నికల్లో చేసిన ఖర్చులను ఎన్నికల సంఘానికి చూపలేదని నేషనల్ ఎలక్షన్ వాచ్ తేల్చి చెప్పింది.