చిత్తూరు జిల్లా కలికిరిలో ఎనిమిదేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మూడు రోజుల క్రితం ఈ బాలుడు కన్పించకుండా పోయాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు: Chittoor జిల్లాలో దారుణం చోటు చేసుకొంది.మూడు రోజుల క్రితం కన్పించకుండా పోయిన ఎనిమిదేళ్ల బాలుడు Uday Kiran హత్యకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
జిల్లాలోని Kalikiri గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడు ఉదయ్ కిరణ్ మూడు రోజుల క్రితం కన్పించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి కోసం కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇవాళ గ్రామానికి సమీపంలోని చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ బాలుడి మూడు రోజలు క్రితం అదృశ్యమయ్యాడు. boyని తీసుకెళ్లిన దుండగులే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడిని ఎవరు తీసుకెళ్లి హత్య చేశారనే విషయమై Police దర్యాప్తు చేస్తున్నారు.