ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,073 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. కోవిడ్ కారణంగా నిన్న ఒక్క రోజే  48 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటి వరకు ఏపీలో మొత్తం మృతుల  సంఖ్య 5,606కి చేరుకుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 67,683 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్క రోజే 8,695 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 5,88,169కి చేరుకుంది. గత 24 గంటల్లో 69,429 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు.

వీటితో మొత్తం టెస్టుల సంఖ్య 54,47,796కి చేరుకుంది. నిన్న ఒక్కరోజులో అనంతపురం 456, చిత్తూరు 713, తూర్పు గోదావరి 1,031, గుంటూరు 533, కడప 368, కృష్ణ 423, కర్నూలు 205, నెల్లూరు 459, ప్రకాశం 806, శ్రీకాకుళం 430, విశాఖపట్నం 340, విజయనగరం 378, పశ్చిమ గోదావరిలలో 931 కేసులు నమోదయ్యాయి.

అలాగే చిత్తూరు 8, ప్రకాశం 8, అనంతపురం 6, కృష్ణ  5, పశ్చిమ గోదావరి 5, కడప 3, నెల్లూరు 3, విశాఖపట్నం 3, తూర్పుగోదావరి 2, గుంటూరు 2, కర్నూలు 2, శ్రీకాకుళంలలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.