అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరొకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2787కు చేరుకుంది. మరణాలు 58కు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ -19తో ఒకరు మరణించారు. 

గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి కోలుకుని పది మంది డిశ్చార్జీ అయ్యారు. దీతో మొత్తం డిశ్చార్జీ అయినవారి సంక్య 1913కు చేరింది. 816 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన 68 కేసుల్లో 9 కేసులు చెన్నైలోని కోయంబేడుకు లింకులున్నవి. 

గత 24 గంటల్లోో 9,664 శాంపిల్స్ ను పరీక్షించగా 68 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది. 

రాష్ట్రంలో కొత్తగా నమోదై పాజిటివ్ కేసుల్లో నెల్లూరు 8, చిత్తూరులో 1 కోయంబేడు నుంచి వచ్చినవారి వల్ల నమోదైనవి. విదేశాల నుంచి వచ్చినవారికి మొత్తం 111 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 219 మంది కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.