ఆరేళ్ల చిన్నారిపై అరవై ఏళ్ల వృద్దుడు అత్యాచారం

First Published 11, Jul 2018, 11:50 AM IST
60-year-old man rapes 6-year-old girl in eluru
Highlights

అభం శుభం తెలియని ఓ చిన్నారిని ఓ అరవై ఏళ్ల వృద్దుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిందితుడు తన మనవరాలి వయసున్న చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు.

అభం శుభం తెలియని ఓ చిన్నారిని ఓ అరవై ఏళ్ల వృద్దుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిందితుడు తన మనవరాలి వయసున్న చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు వలసవెళ్లారు. ఏలూరు
శివారులోని ఓ గ్రామంలో నివాసముంటున్నారు. భార్యా భర్తలు కూలీ పనులకు వెళ్లగా వారి ఏడేళ్ల కూతురు స్కూల్ కి వెళుతుంటుంది.

అయితే నిన్న మద్యాహ్నం స్కూల్ నుండి వచ్చిన చిన్నారిని ఇంట్లోనే ఉన్న తల్లి స్నానం చేయించడానికి దుస్తులు విప్పింది. ఆ తర్వాత ఆమె ఏదో పనిలో పడిపోయింది.  దీంతో చిన్నారి దుస్తులు లేకుండానే ఇంటి బయట ఆడుకోడానికి వెళ్లింది. అయితే చిన్నారిని అలా చూసిన ఓ వృద్దుడికి దారుణమైన కోరిక కలిగింది.

మనవరాలి వయసున్న ఆ చిన్నారిని వృద్దుడు రాంబాబు దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారిని పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడి వికృత చేష్టలకు భయపడిపోయిన చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది.

దీంతో తల్లి స్థానికుల సాయంతో రాంబాబును పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


 

loader