అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లే దారిలో రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. తాడేపల్లి మార్కెట్ వద్ద ఆ గొయ్యి ఏర్పడింది. అది అరడుగుల మేర ఉంది. జగన్ నివాసానికి వెళ్లే దారి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

గొయ్యిని స్థానిక శాసనసభ్యుడు ఆర్కె పరిశీలించారు. ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. గొయ్యిని పూడ్చే పని సాగుతోంది.  ఆ ప్రదేశంలో భూమి కూడా కుంగింది. రోడ్డు మధ్యలో ఆ గొయ్యి ఏర్పడింది. 

ఇదిలావుంటే, కృష్ణా నదికి భారీగా వరదలు వస్తున్నాయి.  జగన్ నివాసం తాడేపల్లిలో ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు పడిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిలోనే అక్కడ గొయ్యి పడినట్లు భావిస్తున్నారు.