ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,292 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,39,719కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 42 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,128కి చేరుకుంది.

గత 24 గంటల్లో 6,102 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 6,84,930కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 48,661 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 66,944 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 63,49,953కి చేరింది.

అనంతపురం 362, చిత్తూరు 784, తూర్పుగోదావరి 652, గుంటూరు 493, కడప 323, కృష్ణ 399, కర్నూలు 175, నెల్లూరు 311, ప్రకాశం 591, శ్రీకాకుళం 204, విశాఖపట్నం 198, విజయనగరం 188, పశ్చిమ గోదావరిలలో 612 కేసులు నమోదయ్యాయి.

అలాగే వైరస్ కారణంగా ప్రకాశం 6, చిత్తూరు 5, తూర్పుగోదావరి 5, అనంతపురం 4, నెల్లూరు 4, విశాఖపట్నం 4, గుంటూరు 3, కడప 3, కృష్ణ 3, కర్నూలు 2, పశ్చిమ గోదావరి 2, విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.