ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 510 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,75,025కి చేరుకుంది. నిన్న ఒక్క రోజే  కోవిడ్ కారణంగా ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7,052 కి చేరింది

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 510 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,75,025కి చేరుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నిన్న ఒక్క రోజే కోవిడ్ కారణంగా ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7,052 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 5,078 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో 665 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,62,895కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు 67,495 మందికి కరోనా నిర్ధారణా పరీక్షలు చేయడంతో మొత్తం టెస్టుల సంఖ్య 1,07,67,117కి చేరింది.

అనంతపురం 17, చిత్తూరు 89, తూర్పుగోదావరి 47, గుంటూరు 74, కడప 21, కృష్ణ 82, కర్నూలు 22, నెల్లూరు 17, ప్రకాశం 34, శ్రీకాకుళం 12, విశాఖపట్నం 18, విజయనగరం 17, పశ్చిమ గోదావరిలలో 60 కేసులు నమోదయ్యాయి. నిన్న గుంటూరు, కడప, విశాఖపట్నంలలో కోవిడ్ కారణంగా ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

Scroll to load tweet…