హైదరాబాద్: దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణలోనూ కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. సామాన్య ప్రజలు మొదలు ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, వీఐపీలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోంచి బయటకు రానివారి పరిస్థితే ఇలావుంటే ఎప్పుడూ రోడ్లపైనే విధులపై విధులు నిర్వహించే పోలీసుల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4,252 మంది పోలీసులకు కరోనా బారిన పడగా 39మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇలా కరోనాబారిన పడిన పోలీసుల్లో అత్యధికులు హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో చేసేవారే వున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు కరోనా బారిన పడటంతో పోలీసు విభాగం, బాధిత కుటుంబాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. 

read more   బ్రేకింగ్: ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు తెలంగాణ సర్కార్ చేతికి

ఇదిలావుంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు మరింత పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 88 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో 1921 కేసులు నమోదయ్యాయి.

అయితే నిన్నటి కన్నా ఈ రోజు తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 88,396కు చేరుకుంది. గత 24 గంటల్లో తెలంగాణలో 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 674కు చేరుకుంది. హైదరాబాదులో ఈ రోజు కూడా తక్కువగానే కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో ఎప్పటిలాగే కేసులు నమోద్యయాయి.

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 28 
భద్రాద్రి కొత్తగూడెం 34
జిహెచ్ఎంసి 356
జగిత్యాల 40
జనగామ 38
జయశంకర్ భూపాలపల్లి 21
జోగులాంబ గద్వాల 51
కామారెడ్డి 44
కరీంనగర్ 73
ఖమ్మం 71
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 17
మహబూబ్ నగర్ 48
మహబూబాబాద్ 38 
మంచిర్యాల 18
మెదక్ 39
మేడ్చెల్ మల్కాజిగిరి 168 
ములుగు 12
నాగర్ కర్నూలు 26
నల్లగొండ 73
నారాయణపేట 6
నిర్మల్ 37
నిజామాబాద్ 63
పెద్దపల్లి 54
రాజన్న సిరిసిల్ల 33
రంగారెడ్డి 134
సంగారెడ్డి  90 
సిద్ధిపేట 63
సూర్యాపేట 47
వికారాబాద్ 14
వనపర్తి 41
వరంగల్ రూరల్ 54
వరంగల్ అర్బన్ 74
యాదాద్రి భువనగిరి 16
మొత్తం 1921