నకిలీ దర్శనం టికెట్ల స్కాంను తిరుపతి పోలీసులు రట్టు చేశారు. ఈ స్కామ్ కు పాల్పడుతున్న 41 వెబ్ సైట్లను మూసేశారు.
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం కోసం ముందుగా టికెట్లు బుక్ చేసుకునేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వీరినే టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. టికెట్ల విక్రయం పేరుతో ఏకంగా 41 ఫేక్ వెబ్ సైట్లను ఏర్పాటు చేశారు. వీటితో భక్తుల్ని మోసపుచ్చుతూ డబ్బులు దండుకుంటున్నారు. దీనికి సంబంధించి టీటీడీకి ఫిర్యాదులు అందడంతో 41 ఫేక్ వెబ్ సైట్లు మూత పడ్డాయి.
తిరుపతిలో దర్శనం కోసం మీరు టిక్కెట్ తీసుకున్నట్లయితే, దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఒరిజినలేనా ధృవీకరించుకోండి. నకిలీ దర్శనం టిక్కెట్లను అమ్ముతూ, భక్తులకు అనుమానం రాకుండా మోసం చేస్తున్న కనీసం 41 వెబ్‌సైట్‌లను పోలీసులు క్లోజ్ చేయించారు. అసలు సైట్ లాగేకనిపించే వెబ్‌సైట్‌ల నుండి టిక్కెట్‌లను విక్రయించి, కోట్లాది రూపాయల నకిలీ టిక్కెట్ స్కామ్ నడుస్తున్నట్లుగా ఈ మొత్తం ఆపరేషన్ కనిపిస్తోంది.
జూన్ 2నుండి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు... ఆ విద్యార్థులకు స్పెషల్ కోచింగ్..
భక్తులు తాము అసలు టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నామని , నిర్దిష్ట తేదీలో దర్శనం కోసం కన్ఫర్మ్ టికెట్ తీసుకుంటున్నామనుకుని ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లిస్తారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌లు ఆలయ కౌంటర్ నుండి టికెట్ తీసుకోవాలని తమ కస్టమర్లకు రిసీట్ లు ఇస్తాయి. బాధితులకు ఆలయ కౌంటర్ వద్దకు వెళ్లినప్పుడు మాత్రమే తాము కొన్నది టికెట్ కాదని.. తమ దగ్గరున్నది నకిలీ రసీదులని అర్థం అవుతుంది.
అప్పటికి కానీ తాము మోసపోయామని గుర్తించలేరు. ఈ నకిలీ వెబ్‌సైట్‌లు ప్రజలకు వీఐపీ టిక్కెట్లను కూడా విక్రయించాయి. భక్తుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ఆలయ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ రాకెట్ వెనుక రాజస్థాన్, యూపీకి చెందిన ముఠాల ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాంటి 41 నకిలీ వెబ్‌సైట్‌లను గుర్తించి మూసివేశారు. నకిలీ టిక్కెట్ల ద్వారా ఇలాంటి సేవలను అందిస్తున్న 13 యాప్‌లు కూడా క్లోజ్ అయ్యాయి.
కాబట్టి ఈసారి ఎవరైనా మీ వాట్సాప్ కు ఇలాంటి టికెట్లకు సంబంధించిన మెసేజ్ వస్తే.. ముందుగా లింక్‌పై క్లిక్ చేయడానికి బదులుగా తిరుపతిలో దర్శనం కోసం చక్కటి మార్గాలను మాత్రమే ఎంచుకోవాలని నిర్ధారించుకోండి. దీనివల్ల మాయగాళ్ళ ట్రిక్కులో పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు.
